నవతెలంగాణ-హైదరాబాద్:‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్పుతో పాటు చట్టాన్ని కాస్తా స్కీమ్ మారుస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (వీబీ జీ రామ్ జీ) బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తంచేశాయి. వారి ఆందోళన నడుమ స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా.. బిల్లు ()కు ఆమోదం లభించింది. ఈ సమయంలో విపక్ష ఎంపీలు వెల్‌లోకి వచ్చి నిరసన చేపట్టాయి. కొందరు ప్రతిపక్ష నేతలు ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లు ప్రతులను చించి విసిరేశారు. ఈ గందరగోళం నేపథ్యంలో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది.
జీ రామ్ జీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం..పత్రాలను చిచ్చిపడేసిన విపక్షాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



