- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు కారణంగా ఏపీ మంత్రి లోకేశ్ వెళ్తున్న విమానాన్ని దారి మళ్లించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరగా, విమానాన్ని జైపూర్‌కు పంపారు. పొగమంచు కారణంగా ఢిల్లీలో ఇప్పటిదాకా 40 విమానాలు రద్దయ్యాయి. మరో 4 విమానాలను దారి మళ్లించారు. మరోవైపు విదేశీ పర్యటనకు వెళ్తున్న ప్రధాని మోడీ విమానం ఆలస్యమైన విషయం తెలిసిందే.
- Advertisement -



