నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో రిజర్వ్‌డ్ సీటు కోసం ఓ మహిళ, సినియర్ సిటిజన్ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తన సీటు తనకు ఇవ్వాలని పట్టుబట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హైదారాబాద్ పటాన్ చెరు నుంచి కోఠికి వెళుతున్న బస్సులో ఓ మహిళ సీనియర్ సిటిజన్ సీట్లో కూర్చుంది. అయితే ఓ పెద్దాయన అక్కడికి వచ్చి.. అది మాకు రిజర్వ్ అయిన సీటు మీరు అక్కడి నుంచి లేవాలని కోరాడు. ఆ మహిళ లేవకపోవడంతో..ఇద్దరి వాగ్వాదం జరిగింది.. కాసేపటికి వాగ్వాదం కాస్త ముదిరి గొడవకు దారితీసింది. ఫ్రీ జర్నీ చేసే మీకే ఇంత రుబాబు.. ఉంటే.. డబ్బులిచ్చి టికెట్ కొనుక్కుని వెళ్లే మాకు ఎంత ఉండాలని.. మహిళపై గరం అయ్యాడు.
అయినప్పటికి మహిళ సీటులోంచి లేవకపోవడంతో ..ఆ పెద్దాయన ఫోన్ కెమెరాతో మహిళను, సీటును రికార్డు చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ మహిళ నన్ను ఎందుకు రికార్డ్ చేస్తున్నావని ఆగ్రహించింది. తోటి ప్రయాణికులు సపోర్ట్ చేశారు. అనంతరం ఆ మహిళ స్టేజీ రాగానే బస్సు దిగి వెళ్లిపోయింది. ఈ తతంగమంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీడియో తెగ వైరల్ అయ్యింది.



