పంజాబ్, ముంబయి డీ నేడు
జైపూర్ : గ్రూప్ దశ మ్యాచులు ముగియకముందే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు అయినా.. టాప్-2 రేసు ఆసక్తి రేపుతోంది. ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న నాలుగు జట్లు క్వాలిఫయర్1లో ఆడేందుకు పోటీపడుతున్నాయి. టాప్-2 రేసు ఉత్కంఠ రేపుతుండగా పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ నేడు తాడోపేడో తేల్చుకోనున్నాయి. 13 మ్యాచుల్లో 8 విజయాలతో పంజాబ్ 17 పాయింట్లు సాధించగా, ముంబయి సైతం 8 విజయాలతో 16 పాయింట్లతో నిలిచింది. నేడు జైపూర్‌లో జరుగనున్న పంజాబ్, ముంబయి మ్యాచ్‌లో నెగ్గిన జట్టు నేరుగా టాప్-2లో నిలువనుంది. పంజాబ్ నెగ్గితే ఎటువంటి సమకరణాలతో సంబంధం లేకుండా అగ్రస్థానంలో నిలువనుంది.ముంబయి ఇండియన్స్ విజయం సాధిస్తే 18 పాయింట్లతో టైటాన్స్‌తో సమానంగా నిలిచినా.. మెరుగైన నెట్ రన్‌రేట్‌తో టాప్-2లో నిలువనుంది. దీంతో ఇరు జట్లు నేడు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ రేసులో గెలిచి టాప్-2లో నిలిచేదెవరో చూడాలి.
టాప్-2పై కన్నేసి..
- Advertisement -
- Advertisement -