Wednesday, February 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయూట్యూబర్‌ అన్వేష్‌పై లుకౌట్‌ నోటీసులు

యూట్యూబర్‌ అన్వేష్‌పై లుకౌట్‌ నోటీసులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: యూట్యూబర్‌ అన్వేష్‌పై పంజాగట్టు పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. సోషల్‌ మీడియాలో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ … గతేడాది పంజాగుట్టలో ఇతడిపై సినీనటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో అన్వేష్‌పై పోలీసులు అప్పట్లోనే కేసు నమోదు చేశారు. ఈ మేరకు తాజాగా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. విశాఖకు చెందిన అన్వేష్‌.. విదేశాల్లో ఉంటూ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తూ వీడియోలు రిలీజ్‌ చేస్తుంటాడు. అన్వేష్‌ కు పంజాగుట్ట పోలీసులు లుకౌట్‌ నోటీసులు ఇవ్వడంపై స్పందించిన కరాటే కల్యాణీ ఇంతటితో ఆగబోమని రెడ్‌ కార్నర్‌ నోటీసులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. దేవీ దేవతలను దూషించడంతో పాటు భారతదేశ పాస్‌ పోర్టును, దేశ రాజముద్రను అవహేళన చేసేలా మాట్లాడి రాజద్రోహం చేశాడని ధ్వజమెత్తారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. విర్రవీగడం, మిడిసి పోవడం మనిషికి పనిచేయదని కరాటే కల్యాణి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -