Thursday, November 13, 2025
E-PAPER
Homeజాతీయం బీహార్‌ కౌంటింగ్‌ కేంద్రంలో లారీలు..

 బీహార్‌ కౌంటింగ్‌ కేంద్రంలో లారీలు..

- Advertisement -

న‌వ‌తెంగాణ‌-హైద‌రాబాద్ : బీహార్‌లోని ఒక కౌంటింగ్‌ కేంద్రంలో లారీలు కనిపించాయి. దీంతో ఈవీఎంలను వాటిలో తీసుకువచ్చినట్లు ఆర్జేడీ ఆరోపించింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు విమర్శించింది. దీనికి సంబంధించి ఒక వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్‌ చేసింది. గురువారం సాయంత్రం ససారాం కౌంటింగ్ కేంద్రంలోకి ఈవీఎంలతో కూడిన లారీలు వచ్చినట్లు ఆర్జేడీ ఆరోపించింది.

కాగా, రోహ్తాస్‌ జిల్లా కలెక్టర్‌, ఆ జిల్లాల‌ ఎన్నికల అధికారి ఉదిత సింగ్ ఈ ఆరోపణలను ఖండించారు. కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన లారీల్లో ఖాళీ స్టీల్ బాక్సులున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం ప్రవేశద్వారం వద్ద వాటిని తనిఖీ చేసినట్లు చెప్పారు. అభ్యర్థులు, వారి మద్దతుదారుల సమక్షంలో ఈ తనిఖీ జరిగిందని, వీడియో కూడా రికార్డ్‌ చేసినట్లు వెల్లడించారు. కౌంటింగ్‌ రోజున ఎన్నికల అధికారులు, అభ్యర్థుల సమక్షంలోనే ఈవీఎం బాక్స్‌లను తెరుస్తామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -