Saturday, January 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబ్రెజిల్‌లో లారీ, బస్సు ఢీ.. 11 మంది మృతి

బ్రెజిల్‌లో లారీ, బస్సు ఢీ.. 11 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ, బస్సు ఎదురెదురుగా వచ్చి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని కారాజిన్హో సమీపాన జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇసుక లోడ్‌తో వస్తున్న లారీ, బస్సు వేగంగా ఢీకొన్నట్లుగా ఫెడరల్ హైవే పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో బస్సు క్యాబిన్ లారీలోకి చొచ్చుకునిపోయింది. అలాగే లారీలోని ఇసుక మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది. దీంతో ఇసుక కింద పడి 11 మంది ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -