Tuesday, April 7, 2026
E-PAPER
Homeక్రైమ్ఖమ్మంలో పరీక్షలు రాసి వస్తున్న పదోతరగతి విద్యార్థుల బస్సును ఢీకొన్న లారీ

ఖమ్మంలో పరీక్షలు రాసి వస్తున్న పదోతరగతి విద్యార్థుల బస్సును ఢీకొన్న లారీ

- Advertisement -

నవతెలంగాణ ఖమ్మం: పదో తరగతి పరీక్షలు రాసి తిరిగి వస్తున్న విద్యార్థుల బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటన ఖమ్మం గ్రామీణ మండలం సత్యనారాయణపురంలో చోటుచేసుకుంది. అరెంపుల మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు.. సత్యనారాయణపురంలో పదో తరగతి పరీక్షలు రాసి బస్సులో బయలుదేరారు. బస్సును లారీ ఢీకొట్టడంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. గాయపడిన విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒక ఉపాధ్యాయురాలు కూడా ఉన్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -