Wednesday, November 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలురోడ్డు క్రాస్ చేస్తున్న వారిని ఢీకొట్టిన లారీ..ముగ్గురు దుర్మరణం

రోడ్డు క్రాస్ చేస్తున్న వారిని ఢీకొట్టిన లారీ..ముగ్గురు దుర్మరణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు క్రాస్ చేస్తున్న వారిని అతి వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్నూలు జిల్లా బళ్లారి చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు వచ్చిన పోలీసులు.. మృతులు రామిరెడ్డి, లక్ష్మినారాయణ రెడ్డి, శ్రీనుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -