– తప్పిన ప్రమాదం , డ్రైవర్ పై కేసు నమోదు
– సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసిపి, సీఐ శ్రీనివాస్
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హుస్నాబాద్ మండలంలోని జిల్లాల గడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసుల చెక్ పోస్ట్ వద్ద శనివారం అర్ధరాత్రి హనుమకొండ నుండి హుస్నాబాద్ కు వెళ్తున్న చేపల లారీ వేగంగా వచ్చి పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేగంగా వచ్చిన చేపల లారీ భారీ కేడ్ల తో పాటు పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో 200 మీటర్ల దూరంలో పంట పొలాలంలో పోలీస్ వాహనం, లారీ రోడ్డుపై పడింది. చెక్ పోస్ట్ వద్ద నిలిపి ఉన్న పోలీస్ వాహనంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.లారీ డ్రైవర్, క్లీనర్ కు స్వల్ప గాయాలు కావడంతో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న హుస్నాబాద్ ఏసీబీ సదానంద ,సిఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలను సేకరించారు . భారీ క్రేన్ సహాయంతో పోలీసు వాహనాన్ని, చేపల లారీని బయటకు తీశారు. అతివేగంగా ప్రమాదకరంగా లారీని నడిపి పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



