నవతెలంగాణ-హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైనదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. అల్పపీడన ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు విస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని, వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం..నేడు ఏపీలో భారీ వర్షాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES