Friday, October 17, 2025
E-PAPER
Homeబీజినెస్రూ. 735 కోట్ల అత్యధిక పన్ను అనంతర లాభంను నమోదు చేసిన L&T ఫైనాన్స్ లిమిటెడ్ 

రూ. 735 కోట్ల అత్యధిక పన్ను అనంతర లాభంను నమోదు చేసిన L&T ఫైనాన్స్ లిమిటెడ్ 

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌- హైద‌రాబాద్‌: భారతదేశ ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో (NBFCలు) ఒకటైన L&T ఫైనాన్స్ లిమిటెడ్ (LTF), సెప్టెంబర్ 30, 2025తో ముగిసిన రెండో త్రైమాసికానికి పన్ను అనంతర లాభాన్ని (PAT) అత్యధిక స్థాయిలో రూ. 735 కోట్లుగా నమోదు చేసింది, ఇది QoQలో 5%, ఏటేటా ప్రాతిపదికన 6% పెరిగింది. ఈ త్రైమాసి కంలో, రిటైల్ బుక్ పరిమాణం ఏటేటా ప్రాతిపదికన 18% పెరిగి రూ. 1,04,607 కోట్లకు చేరుకుంది. 2025 సెప్టెంబర్ 30 తో ముగిసిన రెండో త్రైమాసికానికి కంపెనీ త్రైమాసిక రిటైల్ పంపిణీ రూ. 18,883 కోట్లకు చేరుకుంది, ఏటేటా ప్రాతిపదికన 25% పెరిగింది. 2025సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి రిటైలైజేషన్ 98%గా ఉంది.

కస్టమర్లకు శక్తివంతమైన డిజిటల్ ఛానల్‌గా అవతరించిన కంపెనీ కస్టమర్-ఫేసింగ్ ప్లానెట్ యాప్, సెప్టెంబర్ 30, 2025 నాటికి 2 కోట్లకు పైగా డౌన్‌లోడ్‌లను దాటింది. ఇందులో గ్రామీణ ప్రాంతాలలో 17.6 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లు ఉన్నాయి. ఈ రోజుకు, ఈ ఛానెల్ రూ.6,400 కోట్లకు పైగా వసూలు చేసింది. 934 లక్షలకు పైగా అభ్యర్థనలకు సేవలందిస్తూ, రూ. 19,300 కోట్లకు పైగా రుణాలను అందించింది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్, 2025లో ప్లానెట్ యాప్‌కు ‘ఫైనాన్స్‌లో ఉత్తమ డిజిటల్ అనుభవం’ అవార్డు కూడా లభించింది.

‘ప్రాజెక్ట్ సైక్లోప్స్’ టూ-వీలర్ ఫైనాన్స్, ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్, ఎస్ఎంఈ ఫైనాన్స్‌లలో అమలు చేయ బడింది. ఇది Q3FY26లో వ్యక్తిగత రుణాలు విభాగంలో, FY27లో గృహ రుణాలు, గ్రామీణ సమూహ రుణాలు & MFIలలో ప్రారంభించబడుతుంది. ద్విచక్ర వాహనాల వ్యాపారం కోసం ఏఐ ఆధారిత రియల్ టైమ్ ఆటోమేటెడ్ పోర్ట్‌ఫోలియో మానిటరింగ్ ఇంజిన్ ‘ప్రాజెక్ట్ నోస్ట్రాడమస్’ బీటా వెర్షన్, షెడ్యూల్ చేయబడిన విస్తరణ తేదీకి ఒక నెల ముందుగానే 2025 ఆగస్టులో విడుదల చేయబడింది.

S&P గ్లోబల్ రేటింగ్స్ ఎల్టీఎఫ్ లాంగ్ టర్మ్ ఇష్యూయర్ క్రెడిట్ రేటింగ్‌ను “BBB-/పాజిటివ్” నుండి “BBB/ స్టేబు ల్”కి, షార్ట్ టర్మ్ ఇష్యూయర్ క్రెడిట్ రేటింగ్‌ను “A-3” నుండి “A-2”కి అప్‌గ్రేడ్ చేసింది. ఫిచ్ రేటింగ్స్ ఎల్టీఎఫ్ దీర్ఘకాలిక విదేశీ మరియు స్థానిక కరెన్సీ ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్‌లను స్థిరమైన దృక్పథంతో “BBB-”కి కేటాయించింది. ఈ దీర్ఘకాలిక రేటింగ్‌లు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ మరియు భారతదేశ సావరిన్ క్రెడిట్ రేటింగ్‌తో సమా నంగా ఉంటాయి. ఇది కంపెనీ ప్రపంచ మూలధన మార్కెట్లను ఉపయోగించుకోవడానికి, తన లయబిలిటీ ఫ్రాంచై జీని మరింత వైవిధ్యపరచడానికి, ఇన్వెస్టర్ బేస్‌ను మరింతగా పెంచడానికి వీలు కల్పిస్తుంది.

ఈ ఆర్థిక ఫలితాలపై ఎల్టీఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శ్రీ సుదీప్త రాయ్ మాట్లాడుతూ, ‘‘ఈ త్రైమాసికంలో, మా దృష్టి అమలు, వృద్ధిపై దృఢంగా ఉంది. బీఎఫ్ఎస్ఐ పరిశ్రమలో సంప్రదాయకంగా బలహీనంగా పరిగణించబడే త్రైమాసికంలో బలమైన పనితీరును అందించగలిగాం. గత కొన్ని త్రైమాసికాలుగా చేపట్టిన పరివర్తన చొరవల ద్వారా గ్రామీణ, పట్టణ భౌగోళిక ప్రాంతాలలో మా అన్ని వ్యాపార రంగాలలో మెరుగైన జోరును ఈ పనితీరు ప్రముఖంగా చాటిచెబుతుంది. మా 5-స్తంభాల అమలు వ్యూహంలో భాగంగా సాంకేతికత, ప్రతిభ, శాఖ మౌలిక సదుపాయాల పునరుద్ధరణ – విస్తరణ, బ్రాండ్ నిర్మాణం, కస్టమర్ కేంద్రీకృతంపై నిరంతర దృష్టిపై మా పెట్టు బడులు మాకు ముందస్తు లాభాలను అందించడం ప్రారంభించాయి.

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రుణ పోర్ట్‌ఫోలియోలో చేర్చబడిన మా గోల్డ్ లోన్ విభాగం, ఈ త్రైమా సికంలో గణనీయమైన జోరును పొందింది. దేశంలో ప్రముఖ దేశవ్యాప్త గోల్డ్ ఫైనాన్స్ సంస్థగా ఎదగాలనే మా ఆకాంక్షకు అనుగుణంగా, శాఖల విస్తరణ ద్వారా దేశవ్యాప్తంగా మా భౌగోళిక ఉనికిని నిరంతరం విస్తరించడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి, మా గోల్డ్ డిస్ట్రిబ్యూషన్ బలాన్ని దాదాపు 330 గోల్డ్ లోన్ శాఖలకు పెంచడానికి సుమారు 200 కొత్త శాఖలను జోడించాలని మేం యోచిస్తున్నాం.

అంతేగాకుండా, కంపెనీ ద్విచక్ర వాహన వ్యాపారంలో ఏఐ ఆధారిత ఆటోమేటెడ్ రియల్-టైమ్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ ఇంజిన్ అయిన ‘ప్రాజెక్ట్ నోస్ట్రాడమస్’ బీటా రోల్ అవుట్‌ను అమలు చేసింది. అంతేకాకుండా ఎస్ఎం ఈ వ్యాపారంలో ఏఐ ఆధారిత నెక్స్ట్-జెన్ డిజిటల్ క్రెడిట్ ఇంజిన్ ‘ప్రాజెక్ట్ సైక్లోప్స్’ను విస్తరించింది. ఈ ఆర్థిక సంవ త్సరం రెండో త్రైమాసికంలో మా డిజిటల్ భారీ భాగస్వామ్యాలు కొనసాగాయి, వ్యక్తిగత రుణాలను ప్రారంభిం చడానికి మార్క్యూ భారీ టెక్ భాగస్వాముల జాబితాలో గూగుల్ పే తాజాగా చేరింది.

సానుకూల రుతుపవనాలు, కస్టమర్ల వినియోగ సెంటిమెంట్ మెరుగుపడటం నేపథ్యంలో, జీఎస్టీ 2.0 సంస్క రణల ద్వారా పండుగ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో ఈ జోరు వేగవంత మవుతుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -