- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2620 మద్యం దుకాణాల ఏర్పాటుకు సోమవారం ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించనున్నారు. 95,137 దరఖాస్తులు రాగా ఆబ్కారీ శాఖ అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం దరఖాస్తుల్లో మూడొంతులకు పైగా రాజధానితోపాటు నగర పరిసరాల్లోనే నమోదయ్యాయి. పలు జిల్లాలో కొన్ని దుకాణాలకు దరఖాస్తులు తక్కువగా రావడంతో 19 దుకాణాల లక్కీ డ్రాను ఆబ్కారీశాఖ వాయిదా వేసింది. ఈ దుకాణాలకు మరోసారి దరఖాస్తులను ఆహ్వానించి దరఖాస్తులు పెరిగితే డ్రా తీస్తారు.
- Advertisement -



