- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విమానం టేకప్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్ లో సాంకేతిక లోపం రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్రాంక్ పోర్ట్ కు 160 మంది ప్రయాణికులతో లుఫ్తాన్సా విమానం బుధవారం తెల్లవారుజామున టేకప్ అయింది. టేకప్ అయిన కొద్దిసేపటికి విమానంలో ల్యాండ్ గేర్ లో సాంకేతిక లోపం తలెత్తిందని గమనించిన పైలెట్ హుటాహుటిన విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
- Advertisement -