Friday, April 3, 2026
E-PAPER
Homeక్రైమ్పిచ్చికుక్క స్వైర విహారం..చిన్నారికి తీవ్ర గాయాలు

పిచ్చికుక్క స్వైర విహారం..చిన్నారికి తీవ్ర గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నల్గొండ జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసి.. ముఖం పీక్కు తినేసిందిపిచ్చి కుక్క. ఈ రోజు జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నల్గొండ జిల్లా నకిరేకల్ లో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. నకిరేకల్ కే చెందిన నాలుగేళ్ళ శరత్ చంద్ర అనే బాలుడు వీధిలో ఆడుకుంటుండగా కుక్క దాడి చేసి ముఖాన్ని పట్టుకు పీక్కు తినేసింది. ఈ ఘటనలో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన బాలుడిని ప్రయివేటు హాస్పిటల్ కి నానమ్మ, తాత తరలించారు.  తీవ్ర గాయాలైన చిన్నారిని చంద్రకు ప్రధమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి డాక్టర్లు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -