Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఈ నెల 31న చలో వరంగల్ కు మాదిగలు అధిక సంఖ్యలో తరలిరావాలి

ఈ నెల 31న చలో వరంగల్ కు మాదిగలు అధిక సంఖ్యలో తరలిరావాలి

- Advertisement -
  • – ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ 
  • నవతెలంగాణ- పరాకల
     భారత అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని ఈనెల 31న వరంగల్ నగరానికి వస్తున్న మందకృష్ణ మాదిగకి ఘన స్వాగతం పలకడానికి ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉదయం 10 గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్ కు తరలిరావాలని ఏకు శంకర్ మాదిగ పిలుపునిచ్చారు. బుదవారం పరకాల మండలం కామారెడ్డి పల్లి గ్రామంలో గ్రామ అద్యక్షులు చిరంజీవి, నాయకులు హనుమకొండ విజయ్ మాదిగ ఆద్వర్యంలో సన్నహాక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శంకర్ మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ పురస్కారం అందుకొని మందకృష్ణ మాదిగ వరంగల్ చేరుకుంటున్న సందర్భంగా మందకృష్ణ మాదిగ కి జాతీయస్థాయిలో ఎమ్మార్పీఎస్ దాని అనుబంధ సంఘాల నేతలు వరంగల్ రైల్వే స్టేషన్కు చేరుకొని భారీ ఎత్తున స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. వారి కాన్వాయ్ ర్యాలీ మధ్య ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి పరకాల ప్రాంతంలోని మాదిగలు దాని ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొని మంద కృష్ణ మాదిగకి సాధార ఆహ్వానం పలకాలని శంకర్ మాదిగ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కోయ్యడ విష్ణు మాదిగ, పెండ్యాల చంద్రమౌళి మాదిగ, కొయ్యడ అనిల్ మాదిగ, పెండ్యాల శివకుమార్ మాదిగ, శ్రీపతి రాజు మాదిగ, కొయ్యడ చిరంజీవి మాదిగ, హనుమకొండ రాకేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad