Monday, January 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనిజులాలో అత్యయిక పరిస్థితిని ప్రకటించిన మదురో

వెనిజులాలో అత్యయిక పరిస్థితిని ప్రకటించిన మదురో

- Advertisement -

కారకాస్ :   వెనిజులాలో అధ్యక్షుడు మదురో అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. రాజధాని కారకాస్‌పై అమెరికా జరిపిన అత్యంత తీవ్రమైన సైనిక దురాక్రమణగా ఆయన అభివర్ణించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రస్తుత ప్రభుత్వం వెనిజులా భూభాగం మరియు ప్రజలపై చేసిన అత్యంత తీవ్రమైన సైనిక దురాక్రమణను వెనిజులా, అంతర్జాతీయ సమాజం తిరస్కరిస్తుంది మరియు ఖండిస్తుందని పేర్కొన్నారు. నగరం చుట్టూ విమానాల ఫ్లైఓవర్‌లను పోలిన శబ్దాలతో పాటు పలు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది. నగరం దక్షిణ ప్రాంతంలోని ప్రధాన సైనిక స్థావరం సమీపంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  దేశంలోని అన్ని సామాజిక, రాజకీయ శక్తులు ఐక్యమయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని వెనిజులా ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. సామ్రాజ్యవాద దాడిని తిరస్కరించాలని పిలుపునిచ్చింది. అన్ని జాతీయ రక్షణ ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించారు.

వెనిజులా రాజధాని కారకాస్‌పై జరిగిన వరుస దాడుల వెనుక అమెరికా సైనిక హస్తం ఉందని స్థానిక మీడియా తెలిపింది. అమెరికా దళాలు దాడికి పాల్పడినట్లు  పేరు వెల్లడించేందుకు నిరాకరించిన ట్రంప్‌ యంత్రాంగానికి చెందిన అధికారులు ధృవీకరించినట్లు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే వైట్‌హౌస్‌, పెంటగాన్‌ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

వెనిజులాపై దాడులను కంబోడియా ఖండించింది. కారకాస్‌పై జరిగిన క్షిపణి దాడిని కంబోడియా అధ్యక్షుడు గ్వాటావో పెట్రో శనివారం ఖండించారు. ప్రపంచం మొత్తాన్ని హెచ్చరికలా వారు వెనిజులాపై దాడి చేశారని అన్నారు. దాడులపై ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -