- సందర్శకులతో కిక్కిరిసిన గుట్ట
నవతెలంగాణ-మల్హర్‌రావు:
మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మండలంలోని నాచారం గ్రామపంచాయతీ పరిసర ప్రాంతంలోని మల్లన్నగుట్టపై శ్రీమల్లిఖార్జున స్వామి జాతర ఉత్సవాలను అంగరంగవైభవంగా అది,సోమ రెండు రోజులపాటు నిర్వహించినట్లుగా నిర్వాహకులు చెవురి దేవరాజు,శివకుమార్ తెలిపారు. సందర్శకులతో గుట్ట కిక్కిరిసింది.మల్లికార్జున స్వామిని కొలిచిన వారికి కొంగు బంగారంగా, కోరుకున్న కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవంగా మల్లన్న గుట్టగా సందర్శకులకు ప్రగాఢ నమ్మకం.ప్రతీ సంవత్సరం మహాశివరాత్రిని పురస్కరించుకొని మూడు రోజులు పాటు నిర్వహించే జాతరకు మండలంలోని చుట్టు ప్రక్కల గ్రామాలు,ఇతర జిల్లాలకు చెందిన సందర్శకులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శిచుకొని మొక్కులను చెల్లించారు.ఆదివారం మహా శివరాత్రి కల్యాణ మహోత్సవం, గణపతి నవగ్రహ, లక్ష్మి రుద్రహోమాలు, హనుమాన్ మూలమంత్ర హవనం, సోమవారం మల్లికార్జు స్వామి పెద్దపట్నం నిర్వహించినట్లుగా,మంగళవారం నైవేద్యం, హారతి, కంకణోధ్యాసన,మహా దాశీర్వాదం, తీర్థప్రసాద వియోగం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.




