Wednesday, May 14, 2025
Homeరాష్ట్రీయంగురుకుల డిగ్రీ విద్యార్థినులకు 'మహాలక్ష్మి' దూరం

గురుకుల డిగ్రీ విద్యార్థినులకు ‘మహాలక్ష్మి’ దూరం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎస్సీ గురుకుల డిగ్రి పరీక్షల నేపథ్యంలో కాలేజీ అవరణ నుంచే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలని విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయా కాలేజీల నుంచి బస్సు ప్రయాణ ప్రాంగణం వరకు దూరమున్నందున కాలేజీ ప్రాంగణానికే బస్సు సౌకర్యాన్ని కల్పించాలని వారు కోరుతున్నారు.గతంలో ఎస్సీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి కాలేజీ ప్రాంగణానికే బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు సర్క్యులర్‌ కూడా విడుదల చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 30 ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలున్నాయి. ఒకే సారి వందల మంది విద్యార్థులకు తగిన సమయంలో ఉచిత బస్సు ప్రయాణం కష్టమవుతుందని వారు గుర్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -