- Advertisement -
నవతెలంగాణ – అమరావతి:తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మహానాడు సందర్భంగా కడప పసుపుమయంగా మారింది. మహానాడు ప్రాంగణంలో పార్టీ అధినేత చంద్రబాబు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను వీక్షించారు. అనంతరం వేదికపైకి వచ్చారు. వేదికపై ఉన్న పార్టీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబుకు నమస్కరించారు. అనంతరం వేదికపై చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- Advertisement -