నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం దాడితో పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొని యద్ధానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల శిబిరాలపై ఇండియాన్ ఆర్మీ దాడులు చేసింది. ఈక్రమంలో పలు దేశాలు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా, భారత్‌కు మద్దతుగా నిలిచాయి. కానీ టర్కీ మాత్రం పాక్‌కు మద్దతుగా నిలిచింది. టర్క్ చర్యను ఖండిస్తూ ఇవాళ మహారాష్ట్ర ఆపిల్ వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టర్కిష్ ఆపిల్‌లను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నందున తాము ఆ దేశం నుండి ఆపిల్‌లను కొనడం మానేయాలని నిర్ణయించుకున్నామని APMC మార్కెట్‌లో ఆపిల్ వ్యాపారి సుయోగ్ జెండే తెలిపారు. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు, వారికి సహాయం చేసిన మొదటి దేశం భారతదేశం, కానీ వారు పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చి వారి వక్ర బుద్దిని నిరూపించారని మండిపడ్డారు. టర్కీకి బదులుగా హిమాచల్, ఇతర ప్రాంతాల నుండి ఆపిల్ లను కొనుగోలు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
మహారాష్ట్ర ఆపిల్ వ్యాపారులు సంచలన నిర్ణయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES