Saturday, April 11, 2026
E-PAPER
Homeమహబూబ్ నగర్రాజోలిలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

రాజోలిలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

- Advertisement -

నవతెలంగాణ-రాజోలి: రాజోలి మండల కేంద్రంలో గాంధీ సర్కిల్లో మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి కెవిపిఎస్ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ.. ఈ దేశంలో అణగారిన జాతులకు విద్య అందడం కోసం మహాత్మ జ్యోతిబాపూలే చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు. సమాజంలో అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎన్నో అవమానాలు భరించిన మహోన్నతమైన వ్యక్తి పూలే అని అన్నారు. బడుగు బలహీనవర్గాల కొరకు విద్యని అందించడంలో తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు. తన భార్యతో కలిసి మొట్టమొదటి మహిళా పాఠశాలను ప్రారంభించడం జరిగింది.

నాటు కుల ఆధిపత్య ఉన్మాదులకు ధైర్యంగా ఎదుర్కొని పాఠశాలల ప్రారంభించిన వ్యక్తి పూలే అని అన్నారు. అనంతరం పూలే విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల సలహాదారుడు ఆనంద్ బాబు కెవిపిఎస్ మండల సహాయ కార్యదర్శి కార్పెంటర్ రాజు కెవిపిఎస్ మండల ఉపాధ్యక్షుడు గౌండరాజు నరసింహులుమేకల నాగేష్ బెంజమెను ఆటో నాయకులు జయన్న సౌలు రాజు మరియు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -