Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహాత్మా జ్యోతిభా ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించాలి

మహాత్మా జ్యోతిభా ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించాలి

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
మహాత్మా జ్యోతిభా ఫూలే 200 వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 11 న అధికారికంగా నిర్వహించబడుతుంది అని బీసీ సంక్షేమ శాఖ అధికారి టి.నరసింహులు అన్నారు. బుధవారం జిల్లా కల్లెక్టరేట్, ఐ డి ఓ సి మినీ మీటింగ్ హాల్, మొదటి అంతస్తు, సూర్యపేట యందు జిల్లాలోని ముఖ్యమైన వివిద బి.సి.సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జయంతి మహోత్సవ కార్యక్రమం జయప్రదం చేసేందుకు ప్రతి కుల సంఘ నాయకులు, బిసి సంఘ నాయకులు, ప్రజలలో అవగాహన కల్పించి సమావేశనికి హాజరయ్యేటట్టు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  రాష్ట్ర బిసి సంక్షేమ వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిల్లే,బిసి సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షులు, తలమల్ల హాస్సేన్,  బార్ అసోసియేషన్ సెక్రెటరీ, బయ్యా మల్లిఖార్జున యాదవ్, తన్నీరు రాంప్రభు బిసి సంఘం రాష్ట్ర ఉపద్యక్షులు, నిద్ర సంపత్ నాయుడు బిసి సంఘం జిల్లా అధ్యక్షలు, ఖండాల భాస్కర్ బిసి సంఘం జిల్లా అధ్యక్షలు, బైరు వెంకన్న గౌడ్ బిసి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, బైరు విజయ్ కృష్ణ బిసి సంఘ ప్రధాన కార్యదర్శి, దున్న శ్యామ్, టి యన్ జి ఓ సెక్రెటరీ, యం డి. అయూబ్ ఖాన్ యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ,పసుల అశోక్ యాదవ్ బిసి జిల్లా ఉపాధ్యక్షులు, గిల కత్తుల నాగమణి గౌడ్ , బిసి జిల్లా అధ్యక్షురాలు, వంగరి బ్రహ్మం , జిల్లా కార్యదర్శి , శివ రాత్రి రవి , వడ్డెర సంఘం అధ్యక్షులు మొదలగు వారు సమావేశములో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -