హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహావతార్ నరసింహ’. ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు. హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుడి వరం కోసం ఘోర తపస్సు చేసే సీక్వెన్స్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. నిర్మాత శిల్పా ధావన్ మాట్లాడుతూ, ‘శ్రీ నరసింహ, శ్రీ వరాహుల ఇతిహాస కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఫ్రేమ్, ప్రతి క్షణం, ప్రతి హార్ట్ బీట్ ఈ గొప్ప కథకు ప్రాణం పోసింది’ అని అన్నారు. ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో తొలి యానిమేటెడ్ ఫీచర్ ట్రైలర్ రిలీజ్‌తో డివైన్ జర్నీ ప్రారంభమైంది’ అని దర్శకుడు అశ్విన్ కుమార్ చెప్పారు. 3డీలో ఈ చిత్రం ఐదు భారతీయ భాషలలో ఈనెల 25న విడుదలవుతోంది.