Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కేటీఆర్ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించిన మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి

కేటీఆర్ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించిన మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రైతులు, మహిళలు, యువతలో భయం రేపే ప్రయత్నాలు చేస్తూ… తిరిగి ప్రజలను మోసం చేయాలనే కుట్రతో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శలు సర్వసత్యవిముఖం అని ఆయన చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల ముందే ఈ ఖండన తెలియజేస్తున‌న్నారు.
ఎరువుల కొరత అంటూ కేటీఆర్ చేసిన ఆరోపణ పచ్చి అబద్ధం కేటీఆర్ గారు! మీ పాలనలో ఎరువుల కొరతతో రైతులు బారులు తీరిన దృశ్యాలు మాకెప్పటికీ గుర్తుండి పోతాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 2025లో ఎరువుల సరఫరా 15 శాతం పెరిగింది. ఇది కేంద్రం యూరియా ఆలస్యంగా పంపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించిన ఫలిత‌మ‌న్నారు. అసలు కారణం కేంద్ర ప్రభుత్వం కాగా – రాష్ట్రాన్ని నిందించడమే మీ అసలైన వృత్తిగా మారిపోయిందా? అని ప్ర‌శ్నించారు.
రూ.39,000 కోట్లు బకాయిలా?
ఇప్పటికే ప్రభుత్వం రూ.12,000 కోట్లు రైతు భరోసా కింద చెల్లించింది. మిగిలినవి బడ్జెట్ షెడ్యూల్ ప్రకారం వచ్చేస్తున్నాయి.
మేము మేనిఫెస్టో ఇచ్చిన రెండు నెలల్లోనే అన్నీ అమలవుతాయని ఊహించటం పరిపక్వత లేని రాజకీయం.
మీరు మాత్రం పదేళ్లు అధికారంలో ఉండి రైతుల రుణ మాఫీల పేరుతో కేవలం ప్రచారమే చేసారు. రైతు మిత్రే సాక్షి!
ఆంధ్ర ప్రియత్వం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రకు పరోక్ష పాలన చేస్తూ నీటి వనరులు, నిధులు అక్కడికి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
కేటిఆర్ గారు. పోలవరం పత్తిసీమ –హంద్రీనీవా వంటి ప్రాజెక్టులు తెలంగాణను దోచుకున్నప్పుడు నోరెత్తని బీఆర్ఎస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం అసహ్యకరం అని రేఖ బోయ‌ల‌ప‌ల్లి మండిప‌డ్డారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad