నవతెలంగాణ-హైదరాబాద్ : మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యువిలు ఇప్పుడు భారతదేశంలో ఈవీ మార్కెట్ లీడర్‌లుగా మారాయి. కస్టమర్ల అపూర్వ విశ్వాసం, ఆసక్తి కారణంగా, దేశవ్యాప్తంగా ప్రతి 10 నిమిషాలకు ఒక మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యువి అమ్ముడవుతోంది.
ఈ అద్భుతమైన విజయ పరంపరను కొనసాగిస్తూ, మహీంద్రా జూలై చివరి నుండి రూ. 21.90 లక్షల ఆకర్షణీయమైన ధరకు దాని అత్యంత విజయవంతమైన BE 6 మరియు XEV 9e eSUVల కోసం ప్యాక్ టూ డెలివరీలను ప్రారంభిస్తోంది. ప్యాక్ టూ ఇప్పుడు ఇప్పటికే ఉన్న 59 kWh వేరియంట్‌తో పాటు 79 kWh బ్యాటరీ అవకాశాన్ని కలిగి ఉంటుంది, ఇది వరుసగా 500 కిమీ మరియు 400 కిమీ వాస్తవ-రేంజ్ ను అందిస్తోంది.
ధరలో ఛార్జర్ & ఇన్‌స్టాలేషన్ వ్యయం కలిపి ఉండదు.
అన్ని వేరియంట్‌లకు డెలివరీ సమయంలో ధరలు వర్తిస్తాయి.
ఈ రెండు బ్యాటరీ ఎంపికలూ మహీంద్రా యొక్క అధునాతన టెక్నాలజీ సూట్‌ను కలిగి వున్నాయి. వీటిలో డాల్బీ అట్మాస్‌తో కూడిన 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, పూర్తి గ్లాస్ రూఫ్, లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (లెవల్ 2 ADAS), XEV 9eలో ట్రిపుల్-స్క్రీన్ వైడ్ సినిమాస్కోప్ మరియు BE 6లో రేస్-రెడీ డిజిటల్ కాక్‌పిట్ ఉన్నాయి.