Wednesday, October 22, 2025
E-PAPER
Homeకరీంనగర్మహిళ హత్య కేసులో ప్రధాన నిందుతుడు అరెస్ట్

మహిళ హత్య కేసులో ప్రధాన నిందుతుడు అరెస్ట్

- Advertisement -

సాంకేతికత  ఆధారంగా రాజధానిలో అదుపులోకి..
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

సిరిసిల్లలోని అశోక్ నగర్ లో గత సంవత్సరం మహిళను హత్య చేసిన నిందితుడిని మంగళవారం సిరిసిల్ల సిఐ కృష్ణ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. సీఐ కృష్ణ కథనం ప్రకారం…బీహార్ రాష్ట్రానికి చెందిన రూడల్ సదా,రామ్బ్రిక్స్  సదా అనే ఇద్దరు కూలీలు కూలీ పని కోసం సిరిసిల్లకు వచ్చి  అశోక్ నగర్ లో  రామస్వామి అనే వ్యక్తి ఇంట్లో రూమ్ కిరాయికి తీసుకొని కూలీ పని చేసుకుంటూ జీవిస్తూన్నారు. అందులో కూలి పని చేస్తున్న దగ్గర కోడిముంజకు చెందిన అలకుంట రమ అనే మహిళతో పరిచయం పెంచుకొని ఆమెని అనుభవించాలనే ఉద్దేశ్యంతో 19 మార్చి 2024 న  కూలి పని అయిన తర్వాత ఆమెను రూమ్ కి తీసుకు పోయి ముగ్గురు కలిసి వారు తెచ్చుకున్న మద్యం సేవించిన అనంతరం నిందుతులు ఇద్దరు కలిసి రమను ఒకరి తరువాత ఒకరు అనుభవించాలనుకొగా ఆమెకు మత్తు వదలగా, ఎవరికైనా విషయం చెప్పుతాదనే అనుమానముతో రమను హత్య చేయగా ఈహత్య పై సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా రామ్బ్రిక్స్  సదా ని గత సంవత్సరం అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని, అప్పటి నుండి తప్పించుకోని ఫోన్ నంబర్స్ మార్చుతూ వివిధ రాష్టాల్లో మకాం మారుస్తూ వస్తున్న  రుడల్ సదా అనే నిందుతుణ్ణి సాంకేతికత ఆధారంగా హైదరాబాద్ లో అల్వాల్ లో ఉంటున్నడని తెలుసుకొని మంగళవారం రుడల్ సదా అనే నిందుతుణ్ణి అదుపులోకి తీసుకొని  రిమాండ్ కు తరలించడం జరిగిందని పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ వివరించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -