- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర మార్గంలో పెను ప్రమాదం తప్పింది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ భారీ హోర్డింగ్ నేలకూలింది. జంపన్న వాగు నుంచి గద్దెలకు వెళ్లే మార్గంలో సదురు హోర్డింగ్ కూప్పకూలింది. ప్రమాద సమయంలో ఎవరూ అటువైపు రాకపోకలు సాగించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఓ భక్తునికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..రోడ్డు అడ్డంగా పడిన హోర్డింగ్‌ను తొలగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని అధికారులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



