– టీజీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో చెలరేగిన మంటలు
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
హనుమకొండ జిల్లా బస్టాండ్ సమీపంలో ఆదివారం ఒక్కసారిగా కలకలం రేగింది. వరంగల్-2 డిపోకు చెందిన ఓ ఎలక్ట్రిక్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. బస్సు హనుమకొండ చౌరస్తా సమీపంలో ఉండగా, వాహనం కింది భాగం నుంచి పొగలు రావడాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్ బస్సును నిలిపివేసి అందులోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. డిపో సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై వరంగల్-2 డిపో మేనేజర్ రవి వివరణ ఇస్తూ.. ఎలక్ట్రిక్ బస్సులో మొత్తం 12 బ్యాటరీలు ఉంటాయని, సాంకేతిక కారణాల వల్ల ఒక బ్యాటరీలో స్వల్పంగా మంటలు వచ్చాయని తెలిపారు. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.
హనుమకొండలో తప్పిన పెను ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



