Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం..

అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా భూ ప్రకంపణలు చోటు చేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ స్పష్టం చేసింది. జులై 29 రాత్రి 12: 11 గంటల ప్రాంతంలో కాంప్‌బెల్ బే నుంచి 62 కి.మీ. పశ్చిమ-నైరుతి దిశలో, భూమి ఉపరితలం నుండి 10 కి.మీ. లోతులో సంభవించినట్లు NCS తెలిపింది. హిందూ మహాసముద్రంలో, అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో భూకంప కేంద్రం ఉండగా.. అప్రమత్తం అయిన అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ సునామీ హెచ్చరికలతో భారత్ కు ఎటువంటి ఇబ్బంది కలగదని సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ స్పష్టం చేసింది. అర్ధరాత్రి వచ్చిన ఈ భూకంపం వల్ల స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే దీని వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందుబాటులోకి రాలేదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad