నవతెలంగాణ-హైదరాబాద్ : క్వీన్స్‌ల్యాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.4గా నమోదైంది. యూరోపియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. భూకంపం 10 కి.మీ (6.2 మైళ్ళు) లోతులో సంభవించింది. దీంతో సమీప పట్టణాలు, నగరాల్లో ప్రభావం కనిపించింది. ఆస్తి, ప్రాణ నష్టం అధికారులు ఎలాంటి సమాచారం అందించలేదు. ప్రస్తుతం అధికారులు అప్రమత్తం అయ్యారు.
శనివారం ఉదయం క్వీన్స్‌ల్యాండ్ తూర్పు తీరంలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అధికారులు తెలిపారు. అయితే కొన్ని ఆస్తులు కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. జనాభా ఎక్కువగా ఉన్న తీరప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గతంలో ఈ ప్రాంతాన్ని అధిక ప్రమాదకర భూకంప మండలంగా గుర్తించారు. ప్రస్తుత ప్రమాదాన్ని జియోసైన్స్ ఆస్ట్రేలియా నేషనల్ భూకంప హెచ్చరిక కేంద్రం పరిస్థితిని అంచనా వేస్తోంది.
క్వీన్స్‌ల్యాండ్‌లో భారీ భూకంపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES