Saturday, April 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంEarthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం…ఎనిమిది మంది మృతి

Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం…ఎనిమిది మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. అక్కడి హిందూ కుష్ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావంతో కాబూల్‌లో ఒక ఇల్లు కూలిపోవడంతో ఎనిమిది మంది చనిపోయారని, మరో చిన్నారి గాయపడినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.177 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైన ఈ ప్రకంపనలు ఇస్లామాబాద్, ఢిల్లీ వరకు వ్యాపించాయి.

భారత్‌లో కూడా గట్టిగానే

ఈ భూకంప ప్రభావం భారత్‌లో కూడా గట్టిగానే కనిపించింది. శుక్రవారం రాత్రి 9:50 గంటల సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్ (నొయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్)తో పాటు చండీగఢ్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ వంటి ఉత్తర భారత ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లు, ఆఫీసు భవనాల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటు సాగిన ఈ ప్రకంపనల వల్ల ఫ్యాన్లు, మంచాలు, ఇంట్లోని సామాన్లు కదిలినట్లు నివాసితులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఢిల్లీలో వింత వాతావరణం నెలకొంది. ఒకవైపు అకాల వర్షం కురుస్తుండగానే, మరోవైపు భూకంపం రావడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్, ఉధంపూర్ వంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు భయంతో వణికిపోయారు. అదృష్టవశాత్తూ మన దేశంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. అటు పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ నగరాల్లో కూడా ప్రకంపనలు రావడంతో అక్కడి ప్రజలు కూడా ఆందోళన చెందారు. హిందూకుష్ ప్రాంతం భూకంపాలకు అత్యంత ప్రమాదకరమైన జోన్‌ కావడంతో తరుచుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
















భారత్‌లో
కూడా గట్టిగానే
ఈ భూకంప
ప్రభావం భారత్‌లో కూడా గట్టిగానే
కనిపించింది
. శుక్రవారం
రాత్రి
9:50 గంటల
సమయంలో ఢిల్లీ
ఎన్సీఆర్
(నొయిడా,
గురుగ్రామ్,
ఘజియాబాద్)తో
పాటు చండీగఢ్
, పంజాబ్,
హర్యానా,
జమ్మూ
కాశ్మీర్ వంటి ఉత్తర భారత
ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు
వచ్చాయి
. ఒక్కసారిగా
భూమి కంపించడంతో భయాందోళనకు
గురైన ప్రజలు ఇళ్లు
,
ఆఫీసు
భవనాల నుంచి రోడ్లపైకి పరుగులు
తీశారు
. కొన్ని
సెకన్ల పాటు సాగిన ఈ ప్రకంపనల
వల్ల ఫ్యాన్లు
, మంచాలు,
ఇంట్లోని
సామాన్లు కదిలినట్లు నివాసితులు
సోషల్ మీడియా వేదికగా
పంచుకున్నారు
.ఢిల్లీలో
వింత వాతావరణం నెలకొంది
.
ఒకవైపు
అకాల వర్షం కురుస్తుండగానే
,
మరోవైపు
భూకంపం రావడం ప్రజలను మరింత
ఆందోళనకు గురిచేసింది
.
జమ్మూ
కాశ్మీర్‌లోని శ్రీనగర్
,
ఉధంపూర్
వంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు
భయంతో వణికిపోయారు
.
అదృష్టవశాత్తూ
మన దేశంలో ఇప్పటివరకు ఎలాంటి
ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం
జరిగినట్లు నివేదికలు అందలేదు
.
అటు
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్
,
లాహోర్,
పెషావర్
నగరాల్లో కూడా ప్రకంపనలు
రావడంతో అక్కడి ప్రజలు కూడా
ఆందోళన చెందారు
. హిందూకుష్
ప్రాంతం భూకంపాలకు అత్యంత
ప్రమాదకరమైన జోన్‌ కావడంతో
తరుచుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే
ఉన్నాయి
.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -