- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ కగార్ పేరుతో మరోసారి ఛత్తీస్‌గఢ్ లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 10 మంది మవోయిష్టులు మృతి చెందారు. గురువారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మవోయిష్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో పలువురు సీనియర్ నక్సల్స్ మరణించి ఉండొచ్చని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో కోబ్రా బలగాలు, రాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు. ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత, గ్రౌండ్ వెరిఫికేషన్ ముగిసిన తర్వాత పూర్తి సమాచారం రానుంది.
- Advertisement -