Sunday, October 19, 2025
E-PAPER
Homeజాతీయంథానేలోని కేఫ్‌లో భారీ అగ్నిప్రమాదం..

థానేలోని కేఫ్‌లో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలోని థానే నగరంలోని ఒక నివాస భవనంలో ఉన్న కేఫ్‌లో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో భవనంలో ఉన్న 35 మంది నివాసితులు బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని కేఫ్‌ పూర్తిగా దెబ్బతిందని స్థానికులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -