నవతెలంగాణ-హైదరాబాద్: దక్షిణ కొరియాలోని డేజియోన్ నగరంలో కారు విడి భాగాలు తయారుచేసే కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 55 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 24 మందికి తీవ్రంగా గాయపడ్డారని అగ్నిమాక సంస్థ వెల్లడించింది. అగ్నిమాపక ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి, ప్రాణాలను కాపాడడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరించాలని అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ ఆదేశించారని అధ్యక్ష భవనం బ్లూహౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జాతీయ అగ్నిమాపక సంస్థ వెల్లడించింది.
కాగా, అగ్నిప్రమాదం సంభవించిన కంపెనీ ఆ దేశ రాజధాని సియోల్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రమాదానికి రెండు భవనాల్లో ఒకటి కూలిపోయిందని, మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని అగ్నిమాపక అధికారి మీడియాకు వెల్లడించారు. ఈ కంపెనీ అంజున్ ఇండిస్టియల్. ఇంజన్ విడి భాగాలను తయారుచేసి హ్యూండారు మోటార్, కియా కార్ప్ వంటి ఇతర సంస్థలకు సరఫరా చేస్తున్నామని ఆ కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే ఈ ఘటనపై ఆ కంపెనీ యాజమాన్యం వెంటనే స్పందించలేదు.



