నవతెలంగాణ-ఆలేరు : ఆలేరు మున్సిపాలిటీ కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు ఆయా పార్టీల టిక్కెట్ల కోసం పైరవీలు జోరు అందుకున్నాయి.శనివారం నాడు ఎన్నికల రిజర్వేషన్ ఖరారు కానున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు గత 15 రోజుల క్రితమే పోటీ చేసేందుకు సుముఖత చూపే వ్యక్తులు పేర్లు ఇచ్చారు.తమకు రిజర్వేషన్ అనుకూలిస్తే ఎక్కడ నుండి పోటీ చేయాలని లెక్కలు వేసుకుంటున్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వద్దకు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య వద్దకు మాజీ డి. సి. సి. బి. చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి వద్ద మంతనాలు ప్రారంభించారు.తమకు తెలిసిన వారితో పైరవీలు చేయించుకోవడం స్థానిక నాయకులతో చెప్పించుకోవడం పోటీ పడుతున్న అభ్యర్థులు శుక్రవారం నాడు ఉదయం నుండి ప్రారంభించారు.అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. పోటీ పడుతున్న ఆయా పార్టీల నాయకుల వివరాలు.
కాంగ్రెస్ నుండి టికెట్లు ఆశిస్తున్న వారిలో దోనమకొండ కృష్ణ ఎగ్గిడి శ్రీశైలం ఎండి సలీం లోకేష్ నీలం పద్మ. ఎం ఏ. ఇజాజ్ ఆకవరం మోహన్ రావు చింతకింది మురళి సందుల సురేష్ బిజిన భాస్కర్ వట్టిపల్లి శ్రీనివాస్ కట్టె గుమ్ముల సాగర్ రెడ్డి అంగడి ఆంజనేయులు మార్గం శ్రీధర్ వట్టిపల్లి రాజు కాసుల భాస్కర్ ముదిగొండ శ్రీకాంత్ తాళ్లపల్లి మహేష్ .చిక్క శ్రావణ్ చాగంటి లావణ్య కృష్ణ మల్ రెడ్డి వెంకట్ రెడ్డి ఎం మోహన్ రెడ్డి దూడం మధు చిన్నం యాదగిరి పాము శివ కాంగ్రెస్ నుండి మెరుగు శ్రీధర్ జట్ట సిద్ధులు జూకంటి సంపత్ జూకంటి రమేష్ మల్లెల శ్రీకాంత్ తో పాటు మరో 5 గురు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు
బి.ఆర్.ఎస్ నుండి టికెట్ల కోసం పంతం కృష్ణ నీలపల్లి కవిత బింగి రవి బేతి రాములు పాశికంటి శ్రీను. పాశికంటి సంపత్ కూతాటి అంజన్. పోరెడ్డి శీను మొరిగాడి వెంకటేష్ కుందన చందు కుండే సంపత్ వష్పరి శంకరయ్య ఎలగల హరికృష్ణ పూల శ్రావణ్ జూకంటి చిన్న ఉప్పలయ్య రమణారెడ్డి దడిగ రమేష్ జింకల రామకృష్ణ జూకంటి శ్రీకాంత్ పార్టీ టికెట్లు ఆశిస్తున్నారు.
బిజెపి ఏ పార్టీతో పొత్తు లేకుండా 12 స్థానంలో పోటీ చేయనున్నట్లు సమాచారం. సిపిఐ(ఎం) పార్టీ కలిసి వచ్చే వారితో పొత్తులు కుదుర్చుకొని రెండు లేదా మూడు స్థానాలు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్పారు.



