Wednesday, April 30, 2025
Homeజిల్లాలుమేడేను జయప్రదం చేయండి

మేడేను జయప్రదం చేయండి

యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

మేడే ను విజయవంతం చేయాలని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో దేశంలోని ప్రజల మధ్య కులాల, మతాల పేరుతో విభజించి మత విద్వేషాలు సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో చదువుకున్నా విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా ప్రభుత్వ రంగ సంస్థలను బడా పెట్టుబడి కార్పొరేట్ సంస్థలకు ధారదత్తం చేస్తున్నారన్నారని,ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ నిరుద్యోగుల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు నిర్వహించి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మికులకు నష్టం చేకూరే విధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. తక్షణమే కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేసి మున్సిపాలిటీ,పంచాయతీ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26వేలు వేతనం ఇవ్వాలన్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐఐ సౌకర్యం కల్పించి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. మే 1న జరిగే మేడేలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img