సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నల్ల. వెంకటయ్య..
నవతెలంగాణ – డిండి
సిఐటియు 13వ నల్గొండ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య పిలుపు నిచ్చారు. సిఐటియు డిండి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిసాత్మకమైన సిఐటియు నల్లగొండ జిల్లా 13వ మహాసభ దేవరకొండ పట్టణంలో అక్టోబర్ 26, 27 తేదీలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయడం కోసం కార్మిక వర్గం అంతా ఐక్యంగా పాల్గొనాలన్నారు. ఈ మహాసభలు జయప్రదం చేయడం కోసం అందరూ కృషి చేయాలని అన్నారు.
సిఐటియు జిల్లాలోని సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యల మీద నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు .కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ దేశంలో అనేక ఆందోళన పోరాటాలను నిర్వహిస్తు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకై పోరాడుతున్నామని ఆయన అన్నారు. మతోన్మాద కార్పోరేట్ విధానానికి వ్యతిరేకంగా అనేక ఆందోళనతో కూడిన పోరాటాలు నిర్వహిస్తూ కార్మిక వర్గాన్ని ఐక్యపరుస్తున్నామని అన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు భూషిపాక నిరంజన్, భూషిపాక రాములు, బాలయ్య, పురం మహేశ్వరం తదితరులు పాల్గొన్నారు.
13వ నల్గొండ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES