నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని బస్వాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 28,, 29న హైదరాబాద్ లోజరిగే తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాలుగోవ మహాసభల కరపత్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీపీఎఫ్ జిల్లా అధ్యక్షులు కాశపాక మహేష్, కార్యదర్శి రాసాల నర్సింహ్మా, మాట్లాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమకారుడు భారత్ బఛావొ జాతీయ నాయకుడు గాదె ఇన్నయ్య, పై కేంద్ర ప్రబుత్వం అక్రమంగా ఉపా కేసు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కమిటీ పక్షాన ఖండించారు వెంటనే అతడిని విడుదల చేయాలని డిమాండ్ చేసారు అదే సందర్బంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ క్రియాశీల పాత్ర నిర్వహించిందని మలిదశ ఉద్యమ సందర్భంలో తెలంగాణ జన సభ, తెలంగాణ ఐక్యకారి చరణ కమిటీగా ఆ తర్వాత 2009 డిసెంబర్ ప్రకటన వచ్చి వెనుకకు వెళ్ళిన సందర్భంలో 2010 అక్టోబర్ 9న అమరుడు గద్దర్, ఆకుల భూమయ్య, ప్రజాస్వామిక ఉద్యమకారుల నేతృత్వం తెలంగాణ ప్రజా ఫ్రంట్ గా ఆవిర్భవించిందని తెలిపారు. ప్రత్యేక ప్రజాస్వామిక తెలంగాణే లక్ష్యంగా పోరాడాలని పార్లమెంటు బిల్లు ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని, నిరంతర పోరాటం అవసరమని గుర్తించిందన్నారు.
అనేక ఉద్యమ శక్తులను సంఘాలను విద్యార్థి ఉద్యమాలను ఏకతాటిపైకి తెచ్చి ఊరు ఊరు తిరిగి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందు వరుసలో ఉండి నడిపించిందన్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ జనసభ నుండి మొదలుపెడితే తెలంగాణ రాష్ట్రం సహకారం అయ్యేవరకు ఆ తర్వాత కూడా అనేక త్యాగాలకు సిద్ధపడుతూ కామ్రేడ్ బెల్లి లలిత, కనకాచారి, ఆకుల భూమయ్య, పులి మామిడి మద్దిలేటి, ఇలా ఎందరినో కోల్పోయిన కూడా, ప్రజల ఆకాంక్ష అయిన ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకుంటూ వచ్చిందని రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణ ఉద్యమంలో భాగమైన మౌలిక ఆకాంక్షల హక్కుల సాధన కోసం నిరంతరం ఇక్కడ ప్రభుత్వాలను నిలదీసి పోరాడుతున్న సందర్భంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొంది చివరకు గత ప్రభుత్వం టీపీఎఫ్ పై నిషేధాన్ని విధించి రాష్ట్ర కమిటీ నాయకులపై కేసులు పెట్టి నెలలు సంవత్సరాల తరబడి జైల్లో నిర్బంధించిన, నిర్బంధాన్ని ఎదిరించి, తిరిగి నిలబడి శక్తిని కూడగట్టుకొని ప్రజలకోసం పోరాడుతుంది ఈ సందర్భంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ డిసెంబర్ 28 29న హైదరాబాదులో రాష్ట్ర నాలుగో మహాసభలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలు ప్రజాసామిక వాదులు మేధావులు రచయితలు పాల్గొని తెలంగాణ ప్రజాస్వామిక హక్కుల పోరాటంలో ముందు నడవాల్సిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రసాల బాలస్వామి, ఎండి బాబు, కే అంజనేయులు, ఎం ఉపేందర్, టీ నర్సింహా, యు కోటేష్, ఎం నర్సయ్య, ఎన్ రమేష్ లు పాల్గొన్నారు.



