- Advertisement -
- – సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోతిరాం నాయక్ పిలుపు
నవతెలంగాణ – గాంధారి - గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మోతి రామ్ నాయక్ మాట్లాడుతూ.. ఈనెల 19న జిల్లా భూ సదస్సు జిల్లా కేంద్రంలో జరుపుతున్నామని ఈ సదస్సుకు సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ హాజరవుతారని అలాగే పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకట్ రాములు, జిల్లా కార్యదర్శి కామ్రేడ్ చంద్రశేఖర్ వెంకట్ గౌడ్, పార్టీ శ్రేణులు ఎంత హాజరైతారని అన్నారు. ఈ సదస్సు యొక్క ఉద్దేశం జిల్లాలో అనేక రకాలైన ప్రభుత్వ భూములు దొరల దగ్గర మగ్గుతున్నాయి. పేద ప్రజలను ఆ భూమి లోకి రానీయకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. అట్లాగే ఫారెస్ట్ అధికారులు గిరిజనుల దళితుల భూముల్లో నిషేధించిన గడ్డి మందును చల్లి పంటను ధ్వంసం చేస్తా ఉన్నారు. ఎటువంటి మానవత్వం లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. ప్రభుత్వ భూమిని పేదలకు దక్కకుండా వారి నుండి గుంజుకుంటా ఉన్నారు. అందుకనే వివిధ రకాలైన భూముల సమస్య కోసం భూ సదస్సు నిర్వహిస్తున్నామని ఆరోజు వచ్చిన సమస్యలపై పరిష్కారం అయ్యేంతవరకు ప్రభుత్వ మెడలు వంచి పరిష్కారమయ్యే విధంగా పోరాట కార్యక్రమాలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ప్రకాష్ నాయక్, మండల సీపీఐ(ఎం) నాయకులు సరాప్ కిషన్ రావు, మధు, రాజయ్య పాల్గొన్నారు.
- Advertisement -