Wednesday, July 16, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నవతెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జయప్రదం చేయండి : తమ్మినేని పిలుపు

నవతెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జయప్రదం చేయండి : తమ్మినేని పిలుపు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజల పత్రికగా అందరి మన్ననలందుకున్న నవతెలంగాణ దినపత్రిక దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ప్రజల సమస్యలను వెలికితీస్తూ నవతెలంగాణ ముందుకు సాగడం అభినందనీయమని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఆగస్టు 1న నిర్వహించబోయే పత్రిక పదవ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన లోగోను మంగళవారం హైదరాబాద్‌లోని ఎం.హెచ్‌.భవన్‌లో తమ్మినేని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్‌, సంపాదకులు రాంపల్లి రమేశ్‌, బుకహేౌజ్‌ ఎడిటర్‌ కె.ఆనందాచారి, జనరల్‌ మేనేజర్లు ఎ.వెంకటేశ్‌, లింగారెడ్డి, రఘు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -