Saturday, August 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమలయాళ నటుడు కళాభవన్ నవాస్ అనుమానాస్పద మృతి!

మలయాళ నటుడు కళాభవన్ నవాస్ అనుమానాస్పద మృతి!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మలయాళ నటుడు కళాభవన్ నవాస్ (51) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. హోటల్ గదిలో శవమై కనిపించారు. సినిమా షూటింగ్‌లో భాగంగా హోటల్‌‌లో బస చేశారు. అయితే హోటల్ సిబ్బంది డోర్‌ కొట్టినా తెరవలేదు. దీంతో అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి డోర్ తెరవగా శవమై కనిపించారు. దీంతో ఆయన మరణవార్త వెలుగులోకి వచ్చింది. చొట్టనిక్కరలోని ఒక హోటల్‌లో నవాస్ మృతి చెందారని పోలీసులు తెలిపారు.

హోటల్ గదిలో నవాస్ విగతజీవిగా పడి ఉండడం చూసి పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

కళాభవన్ నవాస్.. బహుముఖ ప్రజ్ఞాశాలి. మలయాళ సినిమాలో మిమిక్రీ కళాకారుడిగా, ప్లేబ్యాక్ సింగర్‌గా.. నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. కళాభవన్ మృతి పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఇక కడసారి చూపు కోసం పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -