Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంశశిథరూర్‌ పై మ‌ల్లిఖార్జున ఖర్గే ఫైర్

శశిథరూర్‌ పై మ‌ల్లిఖార్జున ఖర్గే ఫైర్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రధాని మోడీని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ ప్రశంసించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున ఖర్గే బుధవారం మండిపడ్డారు. ”మాకు దేశం ముందు , కానీ కొంతమందికి ముందు మోడీ” అని ఎద్దేవా చేశారు. శశిథరూర్‌ ఇంగ్లీషులో నిష్ణాతులని అన్నారు. ”నేను ఇంగ్లీష్‌ బాగా చదవలేను. ఆయన భాష బాగుంటుంది. అందుకే తాము ఆయనను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడిని చేశాం ” అని అన్నారు. 26మంది పర్యాటకులను బలిగొన్న పహల్గాం దాడి తర్వాత మొత్తం ప్రతిపక్షం సైన్యానికి మద్దతు ప్రకటించిందని అన్నారు. దేశం ముందు, పార్టీ తర్వాత అని తాము చెప్పామని, కానీ కొంతమంది ముందు మోడీ తర్వాత దేశం అని భావిస్తారు. మనం ఏమి చెయ్యగలమని అన్నారు. ఇప్పటివరకు, కాంగ్రెస్‌ అధిష్టానం నుండి శశిథరూర్‌కు ఎదురైన అతిపెద్ధ అవమానం ఇదే కానుంది. పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఆయన వ్యాఖ్యలపై పార్టీ సహచరులు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad