Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంపాల‌న‌లో మ‌మ‌త బెన‌ర్జీ విఫ‌లం: ప్రధాని మోడీ

పాల‌న‌లో మ‌మ‌త బెన‌ర్జీ విఫ‌లం: ప్రధాని మోడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సర్కార్‌పై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. శాంతిభద్రతలను కాపాడటంలో మమత సర్కార్ పూర్తిగా విఫలమైందని మోడీ ధ్వజమెత్తారు. పౌరుల ప్రాణాలను కాపాడటంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు.గురువారం పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇండియా… విక్షిత్ భారత్‌గా మారాలంటే.. పశ్చిమ బెంగాల్‌ను కూడా విక్షిత్ పశ్చిమ బెంగాల్‌గా మార్చడం ముఖ్యమని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు కొత్త శక్తిని నింపాల్సిన అవసరం ఉందని.. జ్ఞానం.. విజ్ఞాన కేంద్రంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ముర్షిదాబాద్‌, హల్డాలో హింస చెలరేగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని మోడీ విమర్శలు గుప్పించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad