Tuesday, February 3, 2026
E-PAPER
Homeజాతీయంఈసీ ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌పై ‘అభిశంసన’కు మ‌మ‌తా బెన‌ర్జీ స‌న్నాహాలు

ఈసీ ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌పై ‘అభిశంసన’కు మ‌మ‌తా బెన‌ర్జీ స‌న్నాహాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: స్పెష‌ల్ ఓట‌ర్ రివిజ‌న్(స‌ర్) పేరుతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌ర్వే చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ స‌ర్ ప్ర‌క్రియ‌పై విప‌క్షాలు అనేక సందేహాలు లెవ‌నెత్తాయి. వెంట‌నే స‌ర్ స‌ర్వేను నిలిపివేయాల‌ని భారీ ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాయి. ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ గ‌త ఏడాది స‌ర్‌ను వ్య‌తిరేకిస్తూ బీహార్ వ్యాప్తంగా ఓట‌ర్ అధికార్ యాత్ర‌ను కూడా చేప‌ట్టారు.

స‌రైన కార‌ణాలు లేకుండ‌నే ఓట‌ర్ జాబితాలో ల‌క్ష‌ల్లో పేర్ల‌ను తొల‌గిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు దేశ స‌ర్వోన్న‌త‌న్యాయ‌స్థానాన్ని కూడా ఆశ్ర‌యించాయి. విప‌క్షాల పిటిష‌న్ స్వీక‌రించిన కోర్టు..తొల‌గించిన పేర్ల‌ను, తొల‌గింపు గ‌ల కార‌ణాల‌ను తెలియ‌జేయాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి తెలియ‌జేసింది. అయితే కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో స‌ర్ ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా జ‌ర‌గుతోంది.

ఇటీవ‌ల బెంగాల్‌లో స‌వ‌రించిన ఓట‌ర్ జాబితాను ఈసీ విడుద‌ల చేసింది. ఈక్రమంలోనే చిరునామాలో, పేర్లల్లో వ్య‌త్యాసాలు ఉన్నాయ‌ని ఓట‌ర్ లిస్ట్‌లో పెద్ద సంఖ్య‌లో పేర్ల‌ను తొల‌గించింది. ఈసీ చ‌ర్య‌ను సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సుప్రీంకోర్టులో స‌వాలు చేసింది. తొల‌గించిన పేర్ల‌ను వెల్ల‌డించాల‌ని కోర్టు పేర్కొంది. అదే విధంగాసోమ‌వారం ఓట‌ర్ జాబితాలో తొల‌గించిన వ్య‌క్తుల‌ను (బెంగాల్ నుంచి ఢిల్లీకి వ‌ల‌స వ‌చ్చిన) కార్మికుల కుటుంబాల‌ను ఢిల్లీకి వ‌చ్చి క‌లిశారు. 150 మంది కుటుంబాలు బ‌తికి ఉండ‌గానే వారి పేర్ల‌ను ఓట‌ర్ జాబితాలో తొల‌గించార‌ని, ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెళ్లి ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ కు వివ‌రించారు.

ఈ నేప‌థ్యంలో ఈసీ ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ నుంచి స‌రైన స్పంద‌న రాక‌పోవ‌డంతో తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన(Impeaching బిల్లు పెట్టడానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు ప్ర‌చురించాయి. ఈ వ్య‌వ‌హారంపై ఇత‌ర పార్టీల‌తో చ‌ర్చించ‌డానికి దీది ప్లాన్ చేస్తోంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం కొన‌సాగుత‌న్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే ఈసీపై అవిశ్వాసానికి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టానికి పావులుక‌దుపుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -