- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఇండియల్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపిఎసి) చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో గురువారం ఈడీ సోదాలు నిర్వహించింది. ఈడీ సోదాలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం నిరసన చేశారు. జాదవాపూర్ 8బి బస్టాండ్ నుండి హజ్రా మోర్ వరకు జరిగిన నిరసన మార్చ్‌లో ఆమె పాల్గొన్నారు. ఇందులో టిఎంసి సీనియర్ నేతలు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతుదారులు పాల్గొన్నారు. 2026లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ప్రతీకార చర్య కోసం బీజేపీ కేంద్ర సంస్థల్ని దుర్వినియోగపరుస్తోందని మండిపడ్డారు.
- Advertisement -



