1.120 కేజీల గంజాయి స్వాధీనం: ఎస్ వెంకట కృష్ణమూర్తి ఈ ఎస్
నవతెలంగాణ – ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ ప్లాజా సమీపంలో శనివారం నాడు సోదాలు నిర్వహిస్తుండగా పండుగ భానుచందర్ 1.120 ఒక కేజీ నూట ఇరవై గ్రాముల గంజాయితో పట్టుబడ్డాడని భువనగిరి ఎక్సైజ్ సూపర్డెంట్ ఎస్ వెంకట కృష్ణమూర్తి నవతెలంగాణ కు తెలిపారు. ఎస్ టి ఎఫ్ హైదరాబాద్ టీంకు ముందస్తు సమాచారం ఉండడంతో సోదాలు చేశారు పట్టుబడిన వ్యక్తి అనంతరం గ్రామానికి చెందినవారు. మరో వ్యక్తి బొబ్బలనరేందర్ రెడ్డి పారిపోయినట్లు తెలిపారు.అతని ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు.చర్యల నిమిత్తం బోనగిరి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. ఏ వన్ దోషిగా భానుచందర్.కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు పంపినట్లు చెప్పారు. ఎ టు దోషిగా బొబ్బల నరేందర్ రెడ్డి పై కేసు నమోదుచేసినట్లు తెలిపారు.
నరేందర్ రెడ్డిని త్వరలోనే అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెడతామన్నారు. భువనగిరి ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సి ఐ కి రవి చంద్రారెడ్డి మాట్లాడుతూ అక్రమంగా గంజాయినింగ్ నిల్వ ఉంచిన మతకద్రవ్యాలను మత్తు పదార్థాలను సేవించడం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.హైదరాబాద్ ఎస్ టి ఎఫ్ టీంకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.



