- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్‌పల్లి: మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలో అడవి పందుల కోసం పెట్టిన కరెంటు తీగ తగిలి ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే మంగళవారం రాత్రి ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామానికి చెందిన పుస్కూర్ వంశీకృష్ణ ..తన భార్యను కలువడానికి బైక్ మీద మాక్లూర్ మండలంలోని ముత్యంపల్లి వెళ్తుండగా సికింద్రాపూర్ గ్రామ శివారులోని అడవి పందుల కోసం పెట్టిన కరెంట్ తాకి మృతి చెందాడు. మృతుని భార్య పుస్కుర్ రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్సై మహేష్ తెలిపారు.
- Advertisement -


