- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్ ( మహమ్మద్ నగర్) : మహమ్మద్ నగర్ మండలంలోని దూప్ సింగ్ తండకు చెందిన నర్ల నాయక్ (55) వడదెబ్బ తాకి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు రోజుల క్రితం ఉపాధి హామీ పనికి వెళ్లి ఎండలో పనిచేయడం వల్ల వడదెబ్బ తాకిందని ఈరోజు ఉదయం బాన్సువాడ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని వారు తెలిపారు. ఈ విషయంపై వైద్య అధికారులకు సంప్రదించగా మృతదేహం యొక్క రిపోర్టులను చెక్ చేసి ధృవీకరించనునట్టు వారు తెలిపారు.
- Advertisement -