నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్ పూర్ గేట్ సమీపాన  ఈనెల 01 న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మోహమ్మద్ షరీఫ్ తన సిబ్బందితో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఇందల్ వాయి మండలంలోని వెంగళ్ పాడ్ (పాటితండా) కు చెందిన బానోత్ శేఖర్ మోతాదుకు మించి మద్యం సేవించి, వాహనాన్ని నడిపినట్లుపరీక్షలో నిర్దారణ అయింది. వేంటనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.
ఈ నేపథ్యంలో బానోత్ శేఖర్ ను న్యాయస్థానం ముందు హాజరుపరచగా.. ఆయనకు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలుశిక్ష విధించనట్లు తెలిపారు. అనంతరం జైలుకు తరలించినట్లు తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి తమ వాహనాన్ని నడిపి, లేని ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని ఎస్ హెచ్ ఓ మహమ్మద్ షరీఫ్ సూచించారు.

                                    

